బేసియన్ -సత్య పీఠం
నిజాయితీ లేని నిజం లేదు .. నిజం లేని మంచి సమాజం లేదు .. మంచి సమాజం లేకుండా గొప్ప దేశాన్ని కల కనలేము .. కలలే లేని ఒక సంస్కృతి ముందుకి వెళ్ళ జాలదుఏది నిజం ? మనం మన నిర్ణయాలు నిజం ఆధారంగా తీసుకుంటామా ? లేక అభిమానం ఆత్మీయత మరియు పక్షతపాతము తో తీసుకుంటామా ? మన ప్రాణాలు పోతున్నప్పుడు "మన" చెత్త డాక్టరు దెగ్గరికి వెళ్తామా లేక "నచ్చని" వాడయినా మంచి డాక్టరు దెగ్గరికి వెళ్తామా ?
పరిక్షించుకోండి :
ముందుగా , మీరు బాగా నమ్మే ఒక "విషయాన్నీ" ఒక్క వాక్యం లో మనసులో చెప్పుకోండి
ఉదాహరణకి: "దెయ్యాలు వున్నాయి" , "ప్రతిపక్ష నేత తప్పకుండా రాష్ట్రాన్ని దోచుకుంటాడు", "మన నేత తప్పు చేయడు","నాకు సొంత కులపు వాళ్ళ మీద అతి ప్రేమ లేదు", "మా దేవుడు మాత్రమే నిజం"
ఇప్పుడు కేవలం ఈ కింది మూడు ప్రశ్నలకు నిజాయతీ తో సమాధానాలు ఇవ్వండి
గమనిక: ఈ సమాధానాలు ఎవ్వరూ చూడరు కావున నిర్భయంగా నిజం మాట్లాడండి!!
మీరు అనుకున్నది నిజం అని ఎంత ఖచ్చితంగా చెప్పగలరు ? (ఇటువంటి ప్రతిపాదన అంతక్రితం ఎంత వరకు నిజం అయ్యింది )
కష్టం
చాలా తక్కువ
కొంచెం
ఒక మాదిరిగా
కాస్త గట్టిగానే
తిరుగు లేదు
మీరు అనుకున్నది నిజం అని అనటానికి సాక్ష్యాలు రుజువులు ఎంత వున్నాయి అని అనుకుంటున్నారు (మీరు పరిశీలించినవి .. మీకు తెలిసినవి మాత్రమే ) ?
కష్టం
చాలా తక్కువ
కొంచెం
ఒక మాదిరిగా
కాస్త గట్టిగానే
తిరుగు లేదు
ఒక వేళ మీరు అనుకున్నది నిజము కాదు అని అనుకుంటే అప్పుడు ఆ వేరే విషయాన్నీ సమర్ధించటానికి సాక్ష్యాలు ఎన్ని వున్నాయి ? (మళ్ళీ మీరు పరిశీలించినవి .. మీకు తెలిసినవి మాత్రమే)?
కష్టం
చాలా తక్కువ
కొంచెం
ఒక మాదిరిగా
కాస్త గట్టిగానే
తిరుగు లేదు
For Foundational information on Bayesian probability please go through How to Use Baye's theorem
No comments:
Post a Comment