Friday, December 5, 2008

పారెలెల్ యునివర్స్ కధా కమామీషు

టీవి కొన్న తర్వాత చూసిన మంచి ప్రొగ్రామ్సలో నిన్న చూసిన పారెలెల్ యునివర్స్ మీద వచ్చిన ప్రొగ్రామ్ బాగా నచ్చింది. దాని గురించి రాయకుండా ఉండటం కష్టం కదా.. అందుకే ఈ బ్లాగు.
ముందుగా సమాంతర విశ్వం (పారెలెల్ యునివర్స్) అనే ఊహ ఒక సంచలనం అని అనక మానలేం, ఈ క్షణం మనం మరొక విశ్వంలోకూడ అంతర్భాగం అయితే ? మనం చనిపొయ్యారు అనుకున్న మన తాతగారు మరో విశ్వంలో బ్రతికే వుంటే ? అసలు మన కళ్ళ ముందే మన ఇంట్లోనే మనకి కనిపించకుండా వేరే విశ్వంలోని జీవాలు తిరుగుతూ వుంటే ? అన్నిటినీ మించి వీటన్నిటికీ శాస్త్రవేత్తల మద్దత్తు వుంటే ? ఒహ్ నా చిన్న బుర్రకి కాస్త కూడా అర్ధం కాలేదు, అదెలా సాధ్యం ? అయినా శాస్త్రవేత్తలు ఇలాంటి వాటిని ఎలా ప్రతిపాదించారు ? ఏదయినా చూసి , కొలిచి నిర్ధారిస్తారు కదా ? ఇలాంటి సందేహాలు బోలెడు వచ్చాయి. విషయం ఏంటంటే , క్వాంటం ఫిసిక్స్ లోని కొన్ని అర్ఢం కాని ప్రశ్నలకు ఈ సమాతర విశ్వం అనే సిద్దాంతం సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తుంది,చాలా చోట్ల సఫలం అయ్యింది కూడా.

ఇప్పుడు ఈ సమాంతర విశ్వం వుంది అని ప్రతిపాదిస్తే సరిపొయ్యిందా ? ఊహు, ఒక విశ్వం లో నుంచి మరొక విశ్వంలోకి వెళ్ళగలమా అనే ప్రశ్న నా లాంటి చటాక్ (చటాక్ అంటే ముప్పావు అనుకుంటా) బుర్రకే రాగా లేనిది శాస్త్రవేత్తలకి రాదా , వచ్చింది , దాని మీద రకరకాల వాదనలు , గొడవలు షరామామూలే.

నాకే కనక ఇలా విశ్వాల మధ్యలో ప్రయాణించగలిగే యంత్రం దొరికితే ? ........ మ్ మ్ మ్ మ్ మ్ మ్ ఏం చెయ్యచ్చో కూడా అర్ధం తోచట్లేదు.. మీరేం చేస్తారు ?

ఐడియా బానే వుంది కదా అని అప్పుడెప్పుడో వచ్చిన ఆదిత్యా ౩69 తరువాయి భాగం తీసినా తియ్యచ్చు.