Sunday, March 23, 2008

ప్రచారం, సమాజం పై దాని ప్రభావం

ప్రచారం , మనం నిత్యం ఇది చూస్తూనే వుంటాము, చాలా సార్లు ఇది చాలా ముఖ్యం అని కూడ అనిపిస్తుంది, కొన్ని సార్లు భయం కూడా వేస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానాంటే ఒక సారి ప్రపంచ చరిత్ర చూస్తే ముఖ్యంగా మనకి కనిపించేది యుద్ధాలు, పైగా గత 2000 సంవత్సరాలుగా చూసిన ప్రముఖ యుద్ధాలకి ముఖ్య కారణం మతం అని అంటే మనకి పెద్దగా ఆశ్చర్యం కలగక పొవచ్చు , కాని వీటన్నిటికి కారణం మనిషిలొ ఒక విలక్షనమైన గుణం కనిపిస్తుంది. తాను నమ్మిన దానిని యెదుటి వాళ్ళు కూడా ఒప్పుకునేటట్టు చెయ్యటం బహుశా మనిషికి ఆనందం కలగచెస్తుందేమో ?

ఏక్కడో నజరత్ లొ అప్పటి ప్రజల స్ఠితి గతులపైన రొమన్ రాజుల దుష్క్రుత్యాల పైన యూదుల మత పెద్దల పైన లేచిన తిరుగుబాటు స్వరం ఆ ప్రజలకి ఇచిన ఆ నమ్మకం ఏసుని ఆరాధనీయుడ్ని చెశాయి, కాని ఈ విషయలతొ ఏమాత్రం సంభంధం లేని వాళ్ళని కూడ అయన్ని ఆరాధించమని చెప్పటం మనకి తెలుసు , ఈ ప్రచారం మారణ హొమాలదాక దారితీయటానికి మనిషిలొ ఇందాక మనం చెప్పుకున్న ఆ విలక్షన గుణాన్ని చూడొచ్చు.

ఇది కేవలం మతం విషయంలొనే కాదు, రాజకీయ నాయకుల అభిమానుల దెగ్గర్నుంచి చివరకి సినీ హీరొ అభిమానం దాక మనం చూడొచ్చు.

గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఇది జ్ఞాన సంపన్నుల నుంచి అజ్ఞానుల దాక అందరిలో ఈ గుణం వుంటుంది.

ఆవునంటారా ? కాదంటారా ?
బహుశా అవునేమో , నేను కూడా నాకు నచ్చినది ప్రచారమ్ చేసుకోటానికి బ్లాగులు ఎ౦దుకు రాస్తున్నాను ?

Thursday, March 20, 2008

తెలుగు లో ప్రొగ్రామింగ్

వృత్తి రీత్యా ప్రొగ్రామర్ అయిన నేను ఎప్పుడూ అలొచించలేదు, ఎందుకు ఎప్పుడు ఇంగ్లీష్ లోనె కోడ్ రాస్తున్నాను అని. ఆ ఆలొచన నచ్చింది , వెంటనే గూగుల్ లొ వెతకగా తెలిసింది ఇదే ఆలొచన చాలా మందికి వచ్చింది , పైగా వాళ్ల భషల్లొ ప్రొగ్రామ్మింగ్ చెయ్యటానికి వీలుగా చాలా కష్ఠించి సాధించారు అని . ఉదాహరణకి ''బాంగభాష" ఉపయొగించి బెంగాలి భాషలొ ప్రొగ్రామ్మింగ్ చెయ్యొచ్చు .

తెలుగులో కూడా మీకు ఇలాంటి ప్రయత్నాలు ఎమైనా తెలిసి వుంటె నాకు కూడ తెలియచేయండి .