Tuesday, January 22, 2019

Distributed computing

ఒక కంప్యుటర్లో పని చేసే విధిని (ప్రోగ్రాం) రక రకాల ప్రొగ్రామింగ్ భాషలలో రాయొచ్చు . అది అర్ధం చేసుకోవడం కూడ పెద్ద కష్టం కాదు . సాధరణంగా మనదెగ్గర వున్న ఒక కంప్యుటర్లో ఈ విధి పని చెస్తుంది కాబట్టి రాయటం ..మార్పులు చెయ్యటం కూడ సులువు. ఒక వేళ మనం రాసిన విధి పని చెయ్యటానికి ఒకటికన్నా ఎక్కువ కంప్యూటర్లు కావలనుకొండి అప్పుడు మనం రాసిన విధిని  ప్రవిభక్త (డిష్ట్రిబ్యుటెడ్) అంటారు అంటే ఒకటి కన్న ఎక్కువ భాగాలుగా విభజించి పని చెయించటం అన్నమాట .  

ఒక కంప్యుటర్లో పని చేస్తున్న విధి మరొక కంప్యూటర్లో వున్న విధితో కలిసి పని చెయ్యాలంటే  ముఖ్యంగా కావల్సినవి
1) ఆ రెండు కంప్యుటర్లకి అవి ఎక్కడ ఏ పేర్లతో వున్నయొ తెలియటం
2) ఆ రెండు కంప్యూటర్లకి అర్ధమయ్యే ఒక భాష (ప్రోటోకాల్)

ఈ రెండు విషయాలు గుర్థుంచుకుంటే మనం ప్రస్తుతం వాడుకలో వున్న చాలా టెక్నాలజీలని (ఇంకా  పదాలని) సులువుగా అర్ధం చేసుకోగలం

ఉదాహరణకి కొన్ని
1) అర్.పి.సి  ని తీసుకోండి రెండు (లేక చాలా) కంప్యూటర్లలో వున్న విధులు మాట్లాడుకోవటానికి వాడే భాష రిమోట్ ప్రొసీజరల్ కాల్
2) సర్వీస్ డిస్కవరీ : ఒక్కో కంప్యుటరుకీ మరొక కంప్యూటర్ ఎక్కడ వుందో దాని ఆచుకీ తెలియజేసే ఒక  ప్రోగ్రాం
3) హెచ్ టి టి పి : ఇక్కద ఒక కంప్యుటర్లో వున్న విధి మీ ఇంటర్నెట్ బ్రౌసర్  అది మరొక కంప్యుటర్లో వున్న విధితో మాట్లాడటానికి వాడే భాష ఈ హెచ్ టి టి పి


మీకు అర్ధం కాని విషయం ఏదన్నా వుంటే చెప్పండి  .. సులువుగా అర్ధమయ్యేలా చెయ్యటానికి ప్రయత్నిస్తా   

Monday, January 7, 2019

జాతీయ భావన- దేశ భక్తి



భారత దేశంలో పెరుగుతున్న దేశ భక్తిని నియంత్రించాల్సిన అవసరం వుంది అని ఈ మధ్య చాలా మంది జె.ఎన్.యు  సామాజిక శాస్త్రవేత్తలు వాపోతున్నారు . ఈ ఒరవడికి కారణం ఏమిటి అని మామూలు ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతయినా వుంది. దీనిని అర్ధం చేసుకోటానికి మనం వేరే దేశాలలో ఈ దేశాభిమానం ఎలా వుంటుంది అనే విషయన్ని ఆకళింపు  చేసుకోవాలి. ఐరోపాలోని చలా అభివృద్ధి చెదిన దేశాలలో కానీ అమెరికా కెనడా లాంటి దేశాలలో కాని  జనాభలో సారూప్యత చలా ఎక్కువగా వుంటుంది ..వారి మధ్య వున్న తేడాలను కూడా  ఒంటి రంగు ఆధరంగానో లేక పాశ్చాత్య సంస్క్రుతి లేక మత ప్రాతిపదికనో వారిని సమాజంలో ఒకటి చెయ్యటానికి చూస్తారు  భారత దేశంలాంటి విశాల దేశంలో అత్యధిక వైరుధ్యాలు కలిగిన జనాభాలో అందరికి ఆమోద యొగ్యంగా  దేశాన్ని పట్టి వుంచగలిగే విషయం ఈ భారతం నాది అన్న అలోచన మాత్రమే . ప్రజలని ఆ భావన నుండి వేరు చెస్తే కేవలం కొన్ని తరాలలో చలా సులువుగా దెశన్ని ముక్కలు చెయ్యగలిగే అవకాశం వుంటుంది . భారత దేశపు హిందూ పండగలు వ్యవస్థలపై జరిగే దాడులు ఈ అలోచనల ప్రతి రూపమే  .

మీ వాట్సప్పుల్లొ రావణాసురుడు ఎంత మంచి వాడో తన చెల్లిని ఎంతగా ప్రెమించాడు.. రాముడు ఎంత కర్కోటకుడు ..భార్యని అడవుల పాలు చేసాడు లాంటి ఫార్వర్డులు చూసే వుంటారు .. ఇవి ఏవో పిచ్చి రాతలు కావు . చాల జాగ్రత్తగా రాసిన విషయాలు . ఈ విషయలను చూసి హిందువుల్లో ఒక్కళ్ళయిన ప్రభావితం అయితే ఆ మెసేజి సార్ధకం అయినట్టే . అమయకులయిన వాళ్ళకి ఇలాంటి విష ప్రయోగాలు అర్ధం కావు . చదువుకున్న కొందరయినా తమ తమ కుటుంబాలలో ఈ విషయాలు చర్చించటం చాలా అవసరం  . ఉద్యోగం చదువు పెళ్ళి ఇవన్నీ ఎంత ముఖ్యమో దేశం కూడ అంతే ముఖ్యం. మన పిల్లలు , మనువలు మనువరాండ్లు క్షేమంగా బ్రతకాలంటే మనం తీసుకునే నిర్ణయాలే ఆధారం .

8 - 10 వ శతాబ్ధాలలో మన పూర్వీకులు కొందరు చేసిన తప్పుల వల్ల 800 సంవత్సరాలు మనం బానిసలుగా బ్రతికాము..  మన వాళ్ళే అయిన అన్ని  వర్ణాల  కొందరు  తెల్ల వాల్లకి బాసటగ నిలవటం వల్ల మనం తెల్ల వాళ్ళు దోచుకునేలా చేసుకున్నాము.

ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చంద్రగుప్తుడికి కూడ సాధ్యపడని అత్యంత పెద్ద దేశాన్ని ఇప్పుడు మనం పొంద గలిగాం దానిని కాపాడుకోవటం మన బాధ్యత , అవసరం.

ఎవరో దేశ ద్రోహులు పన్నుతున్న పన్నాగాన్ని కళ్ళు మూసుకుని నిదుర నటించి పారనివ్వొద్దు . ప్రేమిద్దాం,  ఈ దేశం కేవలం భూమి కాదు  పవిత్ర భూమి . ఇక్కడ నదులనీ వేదాలు ప్రస్తుతించాయి , ఇతిహాసాలు  కొందరు మహానుభావులకి తల్లులని చేసాయి  ఇది పోతే హిందువుకి ఇంకో దేశం లేదు ఇంకో కైలాసం లేదు మరో రామేశ్వరం లేదు .

అవును నేను దేశ భక్తుడినే  

Sunday, January 6, 2019

విషవిధి (Virus)

విషవిధి (వైరస్)

కంప్యుటర్ పరిభాషలో ఈ వైరస్ అనే పదం వినని వాళ్ళు తక్కువ మంది వుంటారు ..

కాని ఏమిటీ వైరస్ ? మనకి జలుబు చెస్తె వచేలాంటి జబ్బా ?  కంప్యుటర్ కి జబ్బు చెయ్యటమేంటి ?

కిందటి శీర్షికలో ఒక ప్రోగ్రాం ని విధి అని ఎలాగ మనం చెప్పుకున్నామో అలగే మనకి హాని చేసే విధి ని విషవిధి అని అనుకోవచ్చు ..  అంటే అది కూడ ఎవరో ప్రొగ్రామ్మర్ రాసిన ఒక విధి

మనం అజాగ్రత్తగా వుంటే ఇలాంటి విషవిధులు మన కంప్యుటర్ లోకి  లేకపోతే  మన ఫొనుల్లోకి వచ్చె అవకాశం వుంటుంది ...   బాగ పేరున్న కంపనీ అయితే తప్పించి  సాప్టువేర్ ని  మన కంప్యూటర్/ఫొన్లో ప్రతిష్టించుకోకపోవడం (install) మంచిది


అయినా ప్రొగ్రాం మనని ఏం చెయ్యగలదు ?

1) మీ ఆధార్ నంబర్ వేరే దేశానికి పంపించొచ్చు
2) మీ స్నేహితులు ఎవరు అని మీ ఫొన్ ద్వార  తెలుసుకుని వాల్లని మీ పెరుతో మోసం చెయ్యొచ్చు
3) మీ బ్యాంక్ లో డబ్బులన్ని మాయం చెయొచ్చు
ఇంకా చాలా చెయ్యొచ్చు

ప్రతీ యేడు దాదాపు 7000 కోట రుపాయల నష్టం ఈ విష విధుల వల్ల జరుగుతోంది అని ఒక అంచనా ఇది కేవలం ఒక్క అమెరికా దేశంలోనే .. అంతగా అవగాహన లేని మన దేశంలో ఇవి ఇంకా ఎక్కువ జరిగే అవకాశం వుంది .. 

ఇన్ని ప్రామాదాలని కొంచం జాగ్రత్తగా వుంటే మనం తప్పించుకోవచ్చు  

1) వాట్సాప్పుల్లో "డౌన్లోడ్" "ఇన్స్టాల్"  బటన్లని  ని పూర్తిగా విస్మరించండి
2) మీకు ఉచితంగా డబ్బులొస్తున్నయంటే నమ్మకండి
3) చాలా మంది మిమ్మల్ని దోచుకోవటానికి చూస్తున్నారు అని గుర్తుంచుకోండి  

Thursday, January 3, 2019

semaphore mutex processing

సెమాఫొర్ [సంకేత ధర]
మ్యుటెక్స్ [ ఏకతర సంకేతం]

సంకేతధర:  నిజ జీవితంలో మనం వాహనం నడుపుతున్నప్పుడు వచ్చే రక రకాల సిగ్నల్స్(సంకేతాలు)  మనని నియంత్రించటానికి ఉపయొగపడతాయి .. ఒక వేళ ఆ సంకేతాలని (సిగ్నల్స్) ఒక మనిషో లేక ఒక స్థంభమో ధరించిందనుకోండి దానిని మనం సంకేతధర అనవచ్చు  కదా .. అలాగే కంప్యుటర్ లో రెండు వేర్వేరు ప్రక్రియలు ఒకే చోటకి వచినప్పుడు ఏ ప్రక్రియ ముందుకి సాగాలో నియంత్రించటానికి ఒక సంకేతం కావలి .. లేకపోతే ఆ రెండు ప్రక్రియలు ఒకదానితో ఒకటి పోటి పడటమో లేక ప్రమాదానికి దారితియ్యటమో జరుగుతుంది    
 
ఇలా ఎదన్నా ఒక సంకేతాన్ని ఉపయోగించి  ప్రక్రియలని నియంత్రించవచ్చు

ఒక వేళ ఒక సమయంలో ఒకే ఒక ప్రక్రియ సాగలనుకోండి అప్పుడు ఆ సంకేతం ఏకతరం  అవుతుంది ..  దీనినే మ్యుటెక్స్ అంటారు  ...

ఉదాహరణకి ఒక గదికి ఒకే తాళం చెవి వుంటె ఒకడు లోపలికి వెళ్ళాక మళ్ళీ వాడు బయటికి వచ్చి ఆ తాళం వేరే వాళ్ళకి ఇచ్చేదాకా    లోపలకి ఎవ్వరూ వెళ్ళలేకపోతే ఆ తాళం చెవి ఏకతర సంకేతం అన్నమాట .. అలా కాకుండ 10 తాళం చెవులు  వుంటే? అప్పుడు తాళంచెవి  సంకేతధర ..  

అర్ధమయ్యిందా ? 

process, processor

మనం కంప్యుటర్ తో చేయించుకోవాలి అనుకునే పని ఒక "క్రియ" అనుకుందాం .. ఆ పనిని సాధించాలంటే దానికి అర్ధమయ్యే భాష లో కనుక వ్యక్తపరచగలిగితే అప్పుడు  దానిని ప్రక్రియ అనవచు .. ఆ  ప్రక్రియ ఒక సాధనంగా మనకి కావల్సిన పనిని సాధించేది సంసాధకం (ప్రాసెస్సర్)

మనం మన ఫోన్లో ఏదన్న యాప్ వాడుతున్నప్పుడు మీ ఫొన్లో వున్న సాధకం (ప్రాసెస్సర్) ఒక సాధనాన్ని ఉపయోగించుకుని కావల్సిన పనిని చేస్తుంది

ఈ పని బోలెడు చిన్న చిన్న స్వతంత్ర ప్రక్రియలుగా   గా విభజించి వాటితో సంసాధకం (ప్రాసెసర్) పని చేయవచ్చు ..
ఈ చిన్న చిన్న విభాగలనే  చైల్డ్ ప్రాసెసెస్ అంటారు  ..