Sunday, April 27, 2008

తెలుగువారమండి

తెలుగు టివి చానల్స్ లో తెలుగు వెతకటం మూర్ఖత్వం అని తెలిసినా రాయకుండా వుండలేకపోతున్నా (కడుపు మంటనుకుంటా), నేను మా అవిడ ఈ టివి కి జెమిని టివిలలో ఏది పెట్టించుకుందాము అని గొడవ పడి చివరకి మా ఆవిడ మాట గెలిచి జెమిని తీసుకున్ననాము , ఈ మధ్యన పొరపాటున "జాణవులే నెర జాణవులే" అనే ఒక ప్రొగ్రాము చూశా (చూడాల్సి వచ్చింది). ఆ ప్రొగ్రాం మొదలు అయ్యెటప్పుడు ఒక అన్నౌన్సర్ ఈ ప్రొగ్రాం పేరుని "జానేవాలా నెర జానేవాలా" అని చెప్పటంతొ విస్తు పొయా . ఏమిటీ ఖర్మ ? ఎంత తమిళులు నడిపే చానల్ అయినా తెలుగుని ఇంత దరిద్రంగా (హాస్యాస్పదంగా) పలికినా కూడా చూడాల్సిన బాధ్యత లేదా ?

చానల్స్ పుణ్యమా అని తెలుగు చదవటము మరిచిపోయిన తెలుగు వాళ్ళకి కనీసము మంచి తెలుగు వినిపించాల్సింది పోయి అసలు ఆ భాష ఏంటో అర్ధం కాని వింత భాషని తెలుగు ప్రజలమీద రుద్దాల్సిన అవసరమేంటో తెలియటం లేదు

అమ్మ ని అమా గా మార్చేసిన తెలుగు యాంకర్స్ కి నా జోహార్లు

Sunday, April 13, 2008

ఎవరు దేవుడు ? ఎవరు నువ్వు ? ఎవరు నేను ?

నాకూ చాల మంది లాగే భగవద్గీత అంటే చాలా ఇష్టం, మనని నిరంతరం అలోచింపజేసే అద్భుత గ్రంథం. ఓక సారి ఇది చూడండి:

శ్రీ కృష్ణుడు అర్జునునితో:

ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః
స కాలే నేహ మహతా యోగో నష్ఠః పరంతప!!

తమలో వున్న చైతన్యాన్ని పరమాత్మలోని చైతన్యంతో కలిపే శాస్త్రాన్ని గురుపరంపరగా తెలుసుకోగలిగారు రాజర్షులు, కాల క్రమేణా ఇప్పుడు ఆ విద్యని ఈ ప్రపంచం కొల్పోయింది అర్జునా !!

ఏమిటా విద్య ? మనలో చైతన్యం (consciousness) పరమత్మాలో చైతన్యం (super consciousness) అంటే ఏంటి ?

అర్ధం చేసుకొవటానికి ఒక ఉదహరణ చూద్దాము, మనము కలలో చాలా పనులు చేస్తాము , ఆ పనులు చేసేటప్పుడు మనం నిజంగానే ఆ పనులు చెసిన అనుభూతికి లొనవుతాము , కొండమీద నుంచి పడి నప్పుడు గుండె జారుతున్నట్టు అనిపించటం మీకు గుర్తు వుండే వుంటుంది కదూ , మరి కలలో జరిగింది నిజం కాదా అని అడిగితే కొపం వస్తుంది , కానీ ఆ టైం లో అది నిజమే కదా , ఇప్పుడు అదే ఉదాహరణని మన ప్రస్తుత (నిజ ?) జీవితనికి వర్తింపజేద్దాము , ఒక వేళ మనం నిజం అనుకుంటున్న ఈ రూపం/ప్రాణం ఇంకొకళ్ళ కల అయివుంటే ? అసలు అందరూ ఆ కలలో భాగం అయితే ? నన్ను తిట్టుకొకుండా కాసేపు అలోచించండి , ఎదో పిచ్చి వాగుడు అనుకొకండి ఇలాంటివే మెటా ఫిసిక్స్ లో కీలకమైన అలోచనలు , సరే ఇప్పుడు అసలు విషయనికి వద్దాము , మనందరమూ వేరు అని మనం భావిస్తున్నము కదా , అలా కాకుండా మనమందరము ఒకే వ్యక్తి/శక్తి/చైతన్యము యొక్క భాగం ఏమో ? శ్రీ కృష్ణుడు చెప్తోంది దీని గురించేనేమో ?

దీన్ని బట్టి అలోచిస్తే అహం బ్రహ్మస్మి అనే వాక్కు ఎంత గొప్ప వాక్కో అర్ధమవుతుంది , అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు , ఇందాక మనం చెప్పుకున్న పరమ చైతన్యం) అని అర్ధం వస్తుంది , కాబట్టి ప్రతీ వ్యక్తీ , ప్రతి ప్రాణి ఆ చైతన్యమే !! ఎంత గొప్ప అలోచన ! మంత్రాలు మాయలు ప్రాణం పోకపొవటం లాంటివి దేవుడి స్వరూపంగా భావించే ప్రస్తుత సమాజం కన్నా 5000 సంవత్సరాల పూర్వమే ఎంత గొప్ప అలోచనలు ఈ భరత భూమిలో పుట్టాయి ? దేవుడు అనేవాడు నీలో భాగం , నువ్వు దేవుడిలో భాగం. మనం తెలుసుకోవాల్సిందల్లా ఆ చైతన్యంలో భాగం అవ్వటం ఎలా అని !! వుందా మనలో ఆ సత్తా ?

Sunday, April 6, 2008

నల్లని వాడు ... .

అది ఒక పెద్ద హొటల్ .. దాని ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది ..అందులొ నుంచి సూటు బూటు వేసుకున్న ఒక యువకుడు దిగాడు ..అతని చుట్టూ ఫొటోగ్రాఫర్లు , జనాలు .. వాళ్ళల్లొ ఒక నవ యువకుడు చక్కగా బెల్టు బూటు తొ కుతుహలంగా చూస్తున్నాడు .. ఈ కారు కుర్రవాడు హీరో లా నడచి వచ్చి తన కార్ తాళాలను ఈ అబ్బయి వైపుకి విసిరి పార్క్ చెయ్యమన్నాడు ..
కట్
కుర్రవాడు ఒక ప్రముఖ క్రీమ్ వాడాడు.. ఇందాకటి కారు కుర్రవాడు మళ్ళీ వచ్చాడు .. అలానే దిగాడు .. కానీ అందరూ మన లవ్లీ కుర్రవాడి దెగ్గరకు పరిగెత్తారు.!!!! కారణం ...ఇప్పుడు కుర్రాడు తెల్లగా మారాడు... అంటే ఆకర్షణీయంగా మారాడట !

సినిమాల్లో నల్లవాడు ఎవడురా అంటే జొకులు వేసుకోటానికి తప్పకుండా పనికి వచ్చేవాడు అని అర్దం.. ఇది ప్రస్తుత పరిస్థితి

ఈ సమాజమేనా "నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు .. " అని ఆ చక్రధారిని కొలిచి మురిసి పోయింది ?

జాతి విపక్షతకి దీనికి తేడా ఏమన్నా వుందా అనిపించక మానదు కదూ .. కానీ ఇది నిత్య సత్యం ..ప్రతీ రోజూ మనం తెలియకుండానే చేస్తున్న పెద్ద తప్పు . ఎందరో భారతీయుల మనో వేదనకి ఇలాంటి ప్రకటనలు కారణం కాదంటారా ? వీటిని ప్రశ్నించే అవసరం లేదంటారా ? మన దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్న మాట నిజం కాదా ?

అమ్మాయి నల్లగా వుంటుందా అందంగా వుందా అనే మాట మీరు అని కాని విని కానీ వుంటే .. ఇంకోసారి ఆలోచించండి.

Tuesday, April 1, 2008

ఫ్రీ .. ఫ్రీ ... ఫ్రీ ... కరో కరో జర జల్సా

ఈ మధ్య కాల౦లొ ఎన్నికల౦టే చీరలు టీవీలు గట్రా ఫ్రీ ఫ్రీ అనేది సాధారణ విషయ౦ అయ్యింది .. కాబట్టి పెద్ద విషయం కాదు... ఈ రోజు జెమిని వార్తల్లొ గమ్మత్తయిన విషయం విన్నా .. అదేదో ఊర్లొ మన దేశపు గొప్ప(?) పార్టి వాళ్ళు సినిమా టిక్కట్లు ఫ్రీ ఫ్రీ అంటున్నారంట ...(దానికి రక రకాల కారణాలు చెప్తున్నారు.. మనకెందుకు) ఆ సదరు హీరో రాజకీయల్లొకి వచ్చి ఏమి చేస్తారో తెలియదు కాని ఇప్పుడే మనకి బోలెడు ప్రజా ప్రయోజనాలు అగుపించేస్తున్నాయి. ఇంకా ఆ హీరో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు హీరోలు వున్నారు ..వాళ్ళ సిన్మాలు కూడా త్వరగా వస్తే ఈ ఫ్రీ ఫ్రీ ఆఫర్ వాటికి కూడ ఇచ్చే అవకాశం లేకపోలేదు, కాదు కాదు ఇవ్వాలి అధ్యక్షా ....

అయినా సిన్మా చూడటం, కులాల గురంచి గొప్పగా మాట్లాడుకోవటం కన్నా మనకి ఇంకా ఏమి కావాలి ? ఈ మధ్య సభల్లో మంత్రులు బూతులు తిట్టుకుంటూ వుంటె కొన్ని వెబ్ సైట్ల లో మా కులపోడు భలే తిట్టాడ్రా అని తెగ మురిసిపొయ్యారు తెలుగు తేజాలు.
టాపిక్ మారుతోంది ... ఫ్రీ ఫ్రీ గురించి మాట్లాడుతున్నాం కాదా .. నా డిమాండ్ ఏమిటంటే ఆ ఏగస్ పార్టీ వాళ్ళు కూడ ఆ పక్క కులం హీరో సిన్మా త్వరలొ వస్తోంది కాబట్టి దానికి టిక్కట్లు ఫ్రీ ఫ్రీ ఇవ్వాలి ..లేక పొతే మనకి అవుమానం ..

చెత్త సినిమాలకి డబ్బులేల బొక్క అని ... ఇలా ప్రజా సంక్షేమం కోసము ఏ ప్రభుత్వం చేపట్టని గొప్ప చర్యలు చేపట్టటం ముదావహం... అభినందనీయం.

ఏమంటారు గొప్పాంద్రులు .. విలాసులు ...అండ్ అదర్స్ మరియు బ్రదర్స్ ?