Sunday, June 18, 2017

Aryan Issue

Context:
As someone who likes Indian history and sanskrit I naturally follow some handles like @TrueIndology  and scholars like @blog_supplement . 
I think they provide much needed 140 char sized interesting information and a drive to know more details. A recent article in new paper The Hindu created interesting discussions and debates in twitter space from so called forward thinking people mocking "sanghis" that they lost and also cited very strong pro Hindu handle like @blog_supplement (Manasataramgini) agrees to these conclusions.

Aryan issue in India's non scholarly circles is a  serious play of words , changing goal posts and confusion. I feel a need to summarize this problem from a commoners perspective. As bizarre as it may seem but without understanding this i don't think any learned acharya in this field has right to dismiss them as "Idiots" and "Fans of Talageri"


A scholar may have a very clear understanding of what these words mean but here is what  "lay man" mean by these words:

Aryan Invasion Theory (AIT):  India was full of Dravidians living and speaking a language similar to Tamil. Sanskrit speaking Aryans came from some where in central asia on horse drawn carts and destroyed harappa and mohenjadaro pushing tamilians down south imposing sanskrit all over.

ASI: The DNA of dravidians , hence all indians before aryan invasion
ANI: The DNA of north indians, hence all north indians are outsiders


Aryan Migration Theory (AMT): same as above only the war took painfully long time and they slowly migrated and imposted sanskrit


Out of India Theory (OIT): No one came into India  but all sanskrit speaking people in sapta sindhi migrated out taking their language with them


With these definitions ...
1) why an ordinary Indian (who doesn't even know what Linguistics is)  is worried about Linguistic and archeological/anthropological theories ?
2) Why politicians like Subramayam swamy had to constantly talk about genetics and DNA and we are all one ?
3) Why Dravidian handles get excited whenever there is a "break through" proving an outside India Aryan Home land ?


Let us get quick answers:

1) For an ordinary Indian outside Aryan home land automatically means:
         outsiders  came on horse back and pushed the dravidians down so one india is difficult to convince when talking to morons from Dravidian parties. Our divine sanskrit is not ours any more

2) Swamy wants  to propagate a consolidated Hindu identity w.r.t Language , and all Dharmic groups. He also wants to unite Muslim community by asking them to say their ancestors were Hindus.  Lot of OIT supporters are great fans of Swamy

3) The identity of Dravidian politics will fade away if Aryan homeland is estabilished in India so any small information regarding Outside current India's border will excite them

A proper way to think about this problem is forget land boundaries of 2017 and realize that we are part of a great civilization which lost most of it and confined to current boundaries.







Sunday, January 22, 2017

Two Bodies .. a sanskrit translation

आक्टवियो पाज्  महोदयेन विरचितं  "Two Bodies" काव्यस्य संस्कृत अनुवादं


सम्मुखिनौ देहौ कदाचित् तरले
रात्रि  समुद्रमिव भाती ।

सम्मुखिनौ देहौ कदाचित् शिले
रात्रि निर्जन सद्रुसं भाती ।

सम्मुखिनौ देहौ कदाचित्
रत्रौ तरुमूल परिश्वंगमिव भाती ।

सम्मुखिनौ देहौ कदाचित् चुरिके
रात्रे: द्रप्स धारा भवति ।

सम्मुखिनौ देहौ कदाचित्
रिक्ताकाशे पतताम् तारकेव भाती ।

Friday, December 5, 2008

పారెలెల్ యునివర్స్ కధా కమామీషు

టీవి కొన్న తర్వాత చూసిన మంచి ప్రొగ్రామ్సలో నిన్న చూసిన పారెలెల్ యునివర్స్ మీద వచ్చిన ప్రొగ్రామ్ బాగా నచ్చింది. దాని గురించి రాయకుండా ఉండటం కష్టం కదా.. అందుకే ఈ బ్లాగు.
ముందుగా సమాంతర విశ్వం (పారెలెల్ యునివర్స్) అనే ఊహ ఒక సంచలనం అని అనక మానలేం, ఈ క్షణం మనం మరొక విశ్వంలోకూడ అంతర్భాగం అయితే ? మనం చనిపొయ్యారు అనుకున్న మన తాతగారు మరో విశ్వంలో బ్రతికే వుంటే ? అసలు మన కళ్ళ ముందే మన ఇంట్లోనే మనకి కనిపించకుండా వేరే విశ్వంలోని జీవాలు తిరుగుతూ వుంటే ? అన్నిటినీ మించి వీటన్నిటికీ శాస్త్రవేత్తల మద్దత్తు వుంటే ? ఒహ్ నా చిన్న బుర్రకి కాస్త కూడా అర్ధం కాలేదు, అదెలా సాధ్యం ? అయినా శాస్త్రవేత్తలు ఇలాంటి వాటిని ఎలా ప్రతిపాదించారు ? ఏదయినా చూసి , కొలిచి నిర్ధారిస్తారు కదా ? ఇలాంటి సందేహాలు బోలెడు వచ్చాయి. విషయం ఏంటంటే , క్వాంటం ఫిసిక్స్ లోని కొన్ని అర్ఢం కాని ప్రశ్నలకు ఈ సమాతర విశ్వం అనే సిద్దాంతం సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తుంది,చాలా చోట్ల సఫలం అయ్యింది కూడా.

ఇప్పుడు ఈ సమాంతర విశ్వం వుంది అని ప్రతిపాదిస్తే సరిపొయ్యిందా ? ఊహు, ఒక విశ్వం లో నుంచి మరొక విశ్వంలోకి వెళ్ళగలమా అనే ప్రశ్న నా లాంటి చటాక్ (చటాక్ అంటే ముప్పావు అనుకుంటా) బుర్రకే రాగా లేనిది శాస్త్రవేత్తలకి రాదా , వచ్చింది , దాని మీద రకరకాల వాదనలు , గొడవలు షరామామూలే.

నాకే కనక ఇలా విశ్వాల మధ్యలో ప్రయాణించగలిగే యంత్రం దొరికితే ? ........ మ్ మ్ మ్ మ్ మ్ మ్ ఏం చెయ్యచ్చో కూడా అర్ధం తోచట్లేదు.. మీరేం చేస్తారు ?

ఐడియా బానే వుంది కదా అని అప్పుడెప్పుడో వచ్చిన ఆదిత్యా ౩69 తరువాయి భాగం తీసినా తియ్యచ్చు.

Sunday, July 27, 2008

దేవుడా !!!

మళ్లీ ఒక దాడి!! మతం మత్తులో మదమెక్కిన మూకల వికృత చర్యలకు సామాన్య జనం బలి. మృత్యువుకి మతం లేదు , అందరూ సమానమే, బ్రతకడం రాక డబ్బు కోసం బాంబుల బాట పట్టిన దిక్కు మాలిన మూకల వెర్రి ఆవేశానికి అమాయకుల బ్రతుకులు చితికిపోవాల్సిందేనా ? . తెగించిన వాడికి భయమేంటి .. ప్రతీ చోటా పోలీస్ వుండగలడా ? లాంటి చెత్త సమాధానాలు వినీ వినీ విసిగి పోయిన ప్రజలు భయంతో వణకటం తప్ప చేసేది ఏముంది?

సార్వభౌమత్వం పై ఈ-మేయిల్ హెచ్చరికలు వెక్కిరిస్తున్నా వోటు బ్యాంకు పద్దతులు మానటం అమాత్యులకు సాధ్యం కాదు. అగ్ర రాజ్యం లో ప్రజల ప్రాణం విలువ , మన దేశంలో ప్రాణానికి వున్న విలువ కన్నా ఎక్కువ కాబోలు, తన పై దాడిని కేవలం "ఖండించ"కుండా ... రెండు దేశాలని సర్వ నాశనం చేసి ముష్కర మూకలకీ చావు దెబ్బ రుచి చూపించగలిగింది.

షష్టి పూర్తి పిదప కూడా జాతీయ భావాలని ..మనము ఒకే దేశపు బిడ్దలమన్న ఇంగితాన్ని ఇవ్వలేని చచ్చు చదువులు , నువ్వు హిందు, నువ్వు ముస్లిమ్ అన్న భావాలని జయించ లేని దరిద్రపు ప్రజలకి వారి వారి నాయకులకి జోహార్లు. నువ్వు చర్చిలో మాత్రమే క్రైస్తవుడివి , మసీదులో ముస్లిం.. గుడిలో హిందువు ..కానీ బయట సమున్నత భారతావని బిడ్దవి ..తిండి పెట్టలేని అల్లా,జీసస్,రాముడు ఎదుటి వాళ్ళని చంపే ఆదేశాలు ఇచారా ? అని అడగలేని మత పెద్దలకి జేజేలు.

భయం లేని సమాజం లో అభివృద్ధి ..ఆనందం.. పరిఢిల్లుతుంది . ఏం చెయ్యాలో ఆలోచించే తెలివయిన వాళ్ళూ మన దేశంలో చాలా మందే వుండి వుంటారు ..ఒక్క సారి మత ..కుల రహితంగా ఆలోచించరూ..! మా మీద దయతో !! మాకూ పిల్లలు వున్నారు మేము సురక్షితంగా వుండాలంటే అగ్ర రాజ్యానికి వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం తేకండి. మాకోసం కష్ట పడమనట్లేదు , కనీసం మీ పిల్లలు ..మీ మనువల కోసమయినా ఆలోచించండి..

Sunday, April 27, 2008

తెలుగువారమండి

తెలుగు టివి చానల్స్ లో తెలుగు వెతకటం మూర్ఖత్వం అని తెలిసినా రాయకుండా వుండలేకపోతున్నా (కడుపు మంటనుకుంటా), నేను మా అవిడ ఈ టివి కి జెమిని టివిలలో ఏది పెట్టించుకుందాము అని గొడవ పడి చివరకి మా ఆవిడ మాట గెలిచి జెమిని తీసుకున్ననాము , ఈ మధ్యన పొరపాటున "జాణవులే నెర జాణవులే" అనే ఒక ప్రొగ్రాము చూశా (చూడాల్సి వచ్చింది). ఆ ప్రొగ్రాం మొదలు అయ్యెటప్పుడు ఒక అన్నౌన్సర్ ఈ ప్రొగ్రాం పేరుని "జానేవాలా నెర జానేవాలా" అని చెప్పటంతొ విస్తు పొయా . ఏమిటీ ఖర్మ ? ఎంత తమిళులు నడిపే చానల్ అయినా తెలుగుని ఇంత దరిద్రంగా (హాస్యాస్పదంగా) పలికినా కూడా చూడాల్సిన బాధ్యత లేదా ?

చానల్స్ పుణ్యమా అని తెలుగు చదవటము మరిచిపోయిన తెలుగు వాళ్ళకి కనీసము మంచి తెలుగు వినిపించాల్సింది పోయి అసలు ఆ భాష ఏంటో అర్ధం కాని వింత భాషని తెలుగు ప్రజలమీద రుద్దాల్సిన అవసరమేంటో తెలియటం లేదు

అమ్మ ని అమా గా మార్చేసిన తెలుగు యాంకర్స్ కి నా జోహార్లు

Sunday, April 13, 2008

ఎవరు దేవుడు ? ఎవరు నువ్వు ? ఎవరు నేను ?

నాకూ చాల మంది లాగే భగవద్గీత అంటే చాలా ఇష్టం, మనని నిరంతరం అలోచింపజేసే అద్భుత గ్రంథం. ఓక సారి ఇది చూడండి:

శ్రీ కృష్ణుడు అర్జునునితో:

ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః
స కాలే నేహ మహతా యోగో నష్ఠః పరంతప!!

తమలో వున్న చైతన్యాన్ని పరమాత్మలోని చైతన్యంతో కలిపే శాస్త్రాన్ని గురుపరంపరగా తెలుసుకోగలిగారు రాజర్షులు, కాల క్రమేణా ఇప్పుడు ఆ విద్యని ఈ ప్రపంచం కొల్పోయింది అర్జునా !!

ఏమిటా విద్య ? మనలో చైతన్యం (consciousness) పరమత్మాలో చైతన్యం (super consciousness) అంటే ఏంటి ?

అర్ధం చేసుకొవటానికి ఒక ఉదహరణ చూద్దాము, మనము కలలో చాలా పనులు చేస్తాము , ఆ పనులు చేసేటప్పుడు మనం నిజంగానే ఆ పనులు చెసిన అనుభూతికి లొనవుతాము , కొండమీద నుంచి పడి నప్పుడు గుండె జారుతున్నట్టు అనిపించటం మీకు గుర్తు వుండే వుంటుంది కదూ , మరి కలలో జరిగింది నిజం కాదా అని అడిగితే కొపం వస్తుంది , కానీ ఆ టైం లో అది నిజమే కదా , ఇప్పుడు అదే ఉదాహరణని మన ప్రస్తుత (నిజ ?) జీవితనికి వర్తింపజేద్దాము , ఒక వేళ మనం నిజం అనుకుంటున్న ఈ రూపం/ప్రాణం ఇంకొకళ్ళ కల అయివుంటే ? అసలు అందరూ ఆ కలలో భాగం అయితే ? నన్ను తిట్టుకొకుండా కాసేపు అలోచించండి , ఎదో పిచ్చి వాగుడు అనుకొకండి ఇలాంటివే మెటా ఫిసిక్స్ లో కీలకమైన అలోచనలు , సరే ఇప్పుడు అసలు విషయనికి వద్దాము , మనందరమూ వేరు అని మనం భావిస్తున్నము కదా , అలా కాకుండా మనమందరము ఒకే వ్యక్తి/శక్తి/చైతన్యము యొక్క భాగం ఏమో ? శ్రీ కృష్ణుడు చెప్తోంది దీని గురించేనేమో ?

దీన్ని బట్టి అలోచిస్తే అహం బ్రహ్మస్మి అనే వాక్కు ఎంత గొప్ప వాక్కో అర్ధమవుతుంది , అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు , ఇందాక మనం చెప్పుకున్న పరమ చైతన్యం) అని అర్ధం వస్తుంది , కాబట్టి ప్రతీ వ్యక్తీ , ప్రతి ప్రాణి ఆ చైతన్యమే !! ఎంత గొప్ప అలోచన ! మంత్రాలు మాయలు ప్రాణం పోకపొవటం లాంటివి దేవుడి స్వరూపంగా భావించే ప్రస్తుత సమాజం కన్నా 5000 సంవత్సరాల పూర్వమే ఎంత గొప్ప అలోచనలు ఈ భరత భూమిలో పుట్టాయి ? దేవుడు అనేవాడు నీలో భాగం , నువ్వు దేవుడిలో భాగం. మనం తెలుసుకోవాల్సిందల్లా ఆ చైతన్యంలో భాగం అవ్వటం ఎలా అని !! వుందా మనలో ఆ సత్తా ?

Sunday, April 6, 2008

నల్లని వాడు ... .

అది ఒక పెద్ద హొటల్ .. దాని ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది ..అందులొ నుంచి సూటు బూటు వేసుకున్న ఒక యువకుడు దిగాడు ..అతని చుట్టూ ఫొటోగ్రాఫర్లు , జనాలు .. వాళ్ళల్లొ ఒక నవ యువకుడు చక్కగా బెల్టు బూటు తొ కుతుహలంగా చూస్తున్నాడు .. ఈ కారు కుర్రవాడు హీరో లా నడచి వచ్చి తన కార్ తాళాలను ఈ అబ్బయి వైపుకి విసిరి పార్క్ చెయ్యమన్నాడు ..
కట్
కుర్రవాడు ఒక ప్రముఖ క్రీమ్ వాడాడు.. ఇందాకటి కారు కుర్రవాడు మళ్ళీ వచ్చాడు .. అలానే దిగాడు .. కానీ అందరూ మన లవ్లీ కుర్రవాడి దెగ్గరకు పరిగెత్తారు.!!!! కారణం ...ఇప్పుడు కుర్రాడు తెల్లగా మారాడు... అంటే ఆకర్షణీయంగా మారాడట !

సినిమాల్లో నల్లవాడు ఎవడురా అంటే జొకులు వేసుకోటానికి తప్పకుండా పనికి వచ్చేవాడు అని అర్దం.. ఇది ప్రస్తుత పరిస్థితి

ఈ సమాజమేనా "నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు .. " అని ఆ చక్రధారిని కొలిచి మురిసి పోయింది ?

జాతి విపక్షతకి దీనికి తేడా ఏమన్నా వుందా అనిపించక మానదు కదూ .. కానీ ఇది నిత్య సత్యం ..ప్రతీ రోజూ మనం తెలియకుండానే చేస్తున్న పెద్ద తప్పు . ఎందరో భారతీయుల మనో వేదనకి ఇలాంటి ప్రకటనలు కారణం కాదంటారా ? వీటిని ప్రశ్నించే అవసరం లేదంటారా ? మన దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్న మాట నిజం కాదా ?

అమ్మాయి నల్లగా వుంటుందా అందంగా వుందా అనే మాట మీరు అని కాని విని కానీ వుంటే .. ఇంకోసారి ఆలోచించండి.