Showing posts with label andhra pradesh. Show all posts
Showing posts with label andhra pradesh. Show all posts

Tuesday, April 1, 2008

ఫ్రీ .. ఫ్రీ ... ఫ్రీ ... కరో కరో జర జల్సా

ఈ మధ్య కాల౦లొ ఎన్నికల౦టే చీరలు టీవీలు గట్రా ఫ్రీ ఫ్రీ అనేది సాధారణ విషయ౦ అయ్యింది .. కాబట్టి పెద్ద విషయం కాదు... ఈ రోజు జెమిని వార్తల్లొ గమ్మత్తయిన విషయం విన్నా .. అదేదో ఊర్లొ మన దేశపు గొప్ప(?) పార్టి వాళ్ళు సినిమా టిక్కట్లు ఫ్రీ ఫ్రీ అంటున్నారంట ...(దానికి రక రకాల కారణాలు చెప్తున్నారు.. మనకెందుకు) ఆ సదరు హీరో రాజకీయల్లొకి వచ్చి ఏమి చేస్తారో తెలియదు కాని ఇప్పుడే మనకి బోలెడు ప్రజా ప్రయోజనాలు అగుపించేస్తున్నాయి. ఇంకా ఆ హీరో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు హీరోలు వున్నారు ..వాళ్ళ సిన్మాలు కూడా త్వరగా వస్తే ఈ ఫ్రీ ఫ్రీ ఆఫర్ వాటికి కూడ ఇచ్చే అవకాశం లేకపోలేదు, కాదు కాదు ఇవ్వాలి అధ్యక్షా ....

అయినా సిన్మా చూడటం, కులాల గురంచి గొప్పగా మాట్లాడుకోవటం కన్నా మనకి ఇంకా ఏమి కావాలి ? ఈ మధ్య సభల్లో మంత్రులు బూతులు తిట్టుకుంటూ వుంటె కొన్ని వెబ్ సైట్ల లో మా కులపోడు భలే తిట్టాడ్రా అని తెగ మురిసిపొయ్యారు తెలుగు తేజాలు.
టాపిక్ మారుతోంది ... ఫ్రీ ఫ్రీ గురించి మాట్లాడుతున్నాం కాదా .. నా డిమాండ్ ఏమిటంటే ఆ ఏగస్ పార్టీ వాళ్ళు కూడ ఆ పక్క కులం హీరో సిన్మా త్వరలొ వస్తోంది కాబట్టి దానికి టిక్కట్లు ఫ్రీ ఫ్రీ ఇవ్వాలి ..లేక పొతే మనకి అవుమానం ..

చెత్త సినిమాలకి డబ్బులేల బొక్క అని ... ఇలా ప్రజా సంక్షేమం కోసము ఏ ప్రభుత్వం చేపట్టని గొప్ప చర్యలు చేపట్టటం ముదావహం... అభినందనీయం.

ఏమంటారు గొప్పాంద్రులు .. విలాసులు ...అండ్ అదర్స్ మరియు బ్రదర్స్ ?

Sunday, July 29, 2007

నేను కులాన్ని

ఆంధ్ర దేశంలో నేను ప్రతి ఇంటిలో వున్నాను, నా నేస్తాల్లో ఎందరో ప్రముఖులు వున్నారు. ఉద్యోగాల కొసము అమెరికా తదితర దేశాలకి వెళ్ళినా నన్ను మరిచిపొలేక పొయారు. హిందువు అని చెప్పుకునే వాడికి గీత లొ శ్రీ కృష్ణుడు చెప్పిన అందరూ సమానమే అన్న విషయము తెలియదు. అదే నా అస్థిత్వానికి మూలము. నేను చెడ్డదాన్ని కాదు, ఎలా అవుతాను ? ఎదైనా వృత్తి చెడ్డది అవ్వగలదా ? అప్పుడు నేను కాను. మరి నాతో స్నేహం లొ తప్పు ఏముంది ? ఖర్మ ఏమిటంటే నన్ను కొందరు గొప్పగా చూస్తారు, కాని అదే "నన్ను" వేరే వాడి స్నేహం లో తక్కువగా చూస్తారు, ఎందుకో ?

ఇందాక చెప్పాను కదా, వృత్తి గురించి , పూర్వము మనుషుల వృత్తి అనుసారం వారిని విభజించారు , మీకు తెలుసు కదా ఇది, ఇప్పుడు ఆ వృత్తుల ప్రకారము కాక పుట్టుక ప్రకారము విభజించారుట , వినటానికి కృష్ణుడి కే కంగారుగా వుంటుంది, ఇక నా సంగతి ఎందుకు లే !!

సంస్కృతము రాని బ్రాహ్మణుడు , వ్యాపారము చెయ్యని వైశ్యుడు , రాజ్యాలు లేని క్షత్రియులూ .. హాస్యాస్పదంగా వుంది..

ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళందరూ నా పేరు పాడు చేస్తునారు, ఏమిటి దీనికి పరిష్కారం ?

దేశం పరువు నా వల్లే పొయిందంట :-(

కారణము మీరు , మీ అవివేకము . కనీసం నన్ను సమాధి చెయ్యండి , లేదా మీ అవివేకాన్ని అంతం చెయ్యండి.