Sunday, April 6, 2008

నల్లని వాడు ... .

అది ఒక పెద్ద హొటల్ .. దాని ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది ..అందులొ నుంచి సూటు బూటు వేసుకున్న ఒక యువకుడు దిగాడు ..అతని చుట్టూ ఫొటోగ్రాఫర్లు , జనాలు .. వాళ్ళల్లొ ఒక నవ యువకుడు చక్కగా బెల్టు బూటు తొ కుతుహలంగా చూస్తున్నాడు .. ఈ కారు కుర్రవాడు హీరో లా నడచి వచ్చి తన కార్ తాళాలను ఈ అబ్బయి వైపుకి విసిరి పార్క్ చెయ్యమన్నాడు ..
కట్
కుర్రవాడు ఒక ప్రముఖ క్రీమ్ వాడాడు.. ఇందాకటి కారు కుర్రవాడు మళ్ళీ వచ్చాడు .. అలానే దిగాడు .. కానీ అందరూ మన లవ్లీ కుర్రవాడి దెగ్గరకు పరిగెత్తారు.!!!! కారణం ...ఇప్పుడు కుర్రాడు తెల్లగా మారాడు... అంటే ఆకర్షణీయంగా మారాడట !

సినిమాల్లో నల్లవాడు ఎవడురా అంటే జొకులు వేసుకోటానికి తప్పకుండా పనికి వచ్చేవాడు అని అర్దం.. ఇది ప్రస్తుత పరిస్థితి

ఈ సమాజమేనా "నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు .. " అని ఆ చక్రధారిని కొలిచి మురిసి పోయింది ?

జాతి విపక్షతకి దీనికి తేడా ఏమన్నా వుందా అనిపించక మానదు కదూ .. కానీ ఇది నిత్య సత్యం ..ప్రతీ రోజూ మనం తెలియకుండానే చేస్తున్న పెద్ద తప్పు . ఎందరో భారతీయుల మనో వేదనకి ఇలాంటి ప్రకటనలు కారణం కాదంటారా ? వీటిని ప్రశ్నించే అవసరం లేదంటారా ? మన దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్న మాట నిజం కాదా ?

అమ్మాయి నల్లగా వుంటుందా అందంగా వుందా అనే మాట మీరు అని కాని విని కానీ వుంటే .. ఇంకోసారి ఆలోచించండి.

No comments: