Tuesday, April 1, 2008

ఫ్రీ .. ఫ్రీ ... ఫ్రీ ... కరో కరో జర జల్సా

ఈ మధ్య కాల౦లొ ఎన్నికల౦టే చీరలు టీవీలు గట్రా ఫ్రీ ఫ్రీ అనేది సాధారణ విషయ౦ అయ్యింది .. కాబట్టి పెద్ద విషయం కాదు... ఈ రోజు జెమిని వార్తల్లొ గమ్మత్తయిన విషయం విన్నా .. అదేదో ఊర్లొ మన దేశపు గొప్ప(?) పార్టి వాళ్ళు సినిమా టిక్కట్లు ఫ్రీ ఫ్రీ అంటున్నారంట ...(దానికి రక రకాల కారణాలు చెప్తున్నారు.. మనకెందుకు) ఆ సదరు హీరో రాజకీయల్లొకి వచ్చి ఏమి చేస్తారో తెలియదు కాని ఇప్పుడే మనకి బోలెడు ప్రజా ప్రయోజనాలు అగుపించేస్తున్నాయి. ఇంకా ఆ హీరో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు హీరోలు వున్నారు ..వాళ్ళ సిన్మాలు కూడా త్వరగా వస్తే ఈ ఫ్రీ ఫ్రీ ఆఫర్ వాటికి కూడ ఇచ్చే అవకాశం లేకపోలేదు, కాదు కాదు ఇవ్వాలి అధ్యక్షా ....

అయినా సిన్మా చూడటం, కులాల గురంచి గొప్పగా మాట్లాడుకోవటం కన్నా మనకి ఇంకా ఏమి కావాలి ? ఈ మధ్య సభల్లో మంత్రులు బూతులు తిట్టుకుంటూ వుంటె కొన్ని వెబ్ సైట్ల లో మా కులపోడు భలే తిట్టాడ్రా అని తెగ మురిసిపొయ్యారు తెలుగు తేజాలు.
టాపిక్ మారుతోంది ... ఫ్రీ ఫ్రీ గురించి మాట్లాడుతున్నాం కాదా .. నా డిమాండ్ ఏమిటంటే ఆ ఏగస్ పార్టీ వాళ్ళు కూడ ఆ పక్క కులం హీరో సిన్మా త్వరలొ వస్తోంది కాబట్టి దానికి టిక్కట్లు ఫ్రీ ఫ్రీ ఇవ్వాలి ..లేక పొతే మనకి అవుమానం ..

చెత్త సినిమాలకి డబ్బులేల బొక్క అని ... ఇలా ప్రజా సంక్షేమం కోసము ఏ ప్రభుత్వం చేపట్టని గొప్ప చర్యలు చేపట్టటం ముదావహం... అభినందనీయం.

ఏమంటారు గొప్పాంద్రులు .. విలాసులు ...అండ్ అదర్స్ మరియు బ్రదర్స్ ?

No comments: