భారత దేశంలో పెరుగుతున్న దేశ భక్తిని నియంత్రించాల్సిన అవసరం వుంది అని ఈ మధ్య చాలా మంది జె.ఎన్.యు సామాజిక శాస్త్రవేత్తలు వాపోతున్నారు . ఈ ఒరవడికి కారణం ఏమిటి అని మామూలు ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతయినా వుంది. దీనిని అర్ధం చేసుకోటానికి మనం వేరే దేశాలలో ఈ దేశాభిమానం ఎలా వుంటుంది అనే విషయన్ని ఆకళింపు చేసుకోవాలి. ఐరోపాలోని చలా అభివృద్ధి చెదిన దేశాలలో కానీ అమెరికా కెనడా లాంటి దేశాలలో కాని జనాభలో సారూప్యత చలా ఎక్కువగా వుంటుంది ..వారి మధ్య వున్న తేడాలను కూడా ఒంటి రంగు ఆధరంగానో లేక పాశ్చాత్య సంస్క్రుతి లేక మత ప్రాతిపదికనో వారిని సమాజంలో ఒకటి చెయ్యటానికి చూస్తారు భారత దేశంలాంటి విశాల దేశంలో అత్యధిక వైరుధ్యాలు కలిగిన జనాభాలో అందరికి ఆమోద యొగ్యంగా దేశాన్ని పట్టి వుంచగలిగే విషయం ఈ భారతం నాది అన్న అలోచన మాత్రమే . ప్రజలని ఆ భావన నుండి వేరు చెస్తే కేవలం కొన్ని తరాలలో చలా సులువుగా దెశన్ని ముక్కలు చెయ్యగలిగే అవకాశం వుంటుంది . భారత దేశపు హిందూ పండగలు వ్యవస్థలపై జరిగే దాడులు ఈ అలోచనల ప్రతి రూపమే .
మీ వాట్సప్పుల్లొ రావణాసురుడు ఎంత మంచి వాడో తన చెల్లిని ఎంతగా ప్రెమించాడు.. రాముడు ఎంత కర్కోటకుడు ..భార్యని అడవుల పాలు చేసాడు లాంటి ఫార్వర్డులు చూసే వుంటారు .. ఇవి ఏవో పిచ్చి రాతలు కావు . చాల జాగ్రత్తగా రాసిన విషయాలు . ఈ విషయలను చూసి హిందువుల్లో ఒక్కళ్ళయిన ప్రభావితం అయితే ఆ మెసేజి సార్ధకం అయినట్టే . అమయకులయిన వాళ్ళకి ఇలాంటి విష ప్రయోగాలు అర్ధం కావు . చదువుకున్న కొందరయినా తమ తమ కుటుంబాలలో ఈ విషయాలు చర్చించటం చాలా అవసరం . ఉద్యోగం చదువు పెళ్ళి ఇవన్నీ ఎంత ముఖ్యమో దేశం కూడ అంతే ముఖ్యం. మన పిల్లలు , మనువలు మనువరాండ్లు క్షేమంగా బ్రతకాలంటే మనం తీసుకునే నిర్ణయాలే ఆధారం .
8 - 10 వ శతాబ్ధాలలో మన పూర్వీకులు కొందరు చేసిన తప్పుల వల్ల 800 సంవత్సరాలు మనం బానిసలుగా బ్రతికాము.. మన వాళ్ళే అయిన అన్ని వర్ణాల కొందరు తెల్ల వాల్లకి బాసటగ నిలవటం వల్ల మనం తెల్ల వాళ్ళు దోచుకునేలా చేసుకున్నాము.
ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చంద్రగుప్తుడికి కూడ సాధ్యపడని అత్యంత పెద్ద దేశాన్ని ఇప్పుడు మనం పొంద గలిగాం దానిని కాపాడుకోవటం మన బాధ్యత , అవసరం.
ఎవరో దేశ ద్రోహులు పన్నుతున్న పన్నాగాన్ని కళ్ళు మూసుకుని నిదుర నటించి పారనివ్వొద్దు . ప్రేమిద్దాం, ఈ దేశం కేవలం భూమి కాదు పవిత్ర భూమి . ఇక్కడ నదులనీ వేదాలు ప్రస్తుతించాయి , ఇతిహాసాలు కొందరు మహానుభావులకి తల్లులని చేసాయి ఇది పోతే హిందువుకి ఇంకో దేశం లేదు ఇంకో కైలాసం లేదు మరో రామేశ్వరం లేదు .
అవును నేను దేశ భక్తుడినే
No comments:
Post a Comment