Wednesday, December 19, 2018

కంప్యుటర్ ప్రొగ్రామ్మింగ్ అన్నిటికంటే సులువయిన పని

తి తక్కువ తెలివితేటలతో అతి ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టగలిగే పనుల్లో ఇదీ ఒకటి .. మీకు కావల్సింది కాస్తంత ఓపిక .. కొంచం సమయస్పూర్తి 

మూడు చెరువుల నీళ్ళు తాగించాడు అని ఒక వాక్యముంది అది వినంగానే మీరు ఎవర్నో తెగ కష్ట పెట్టాడు అని అనుకుంటారా లెక నిజంగనే మూదు చెరువుల నీళ్ళు తాగించారు అనుకుంటారా ? 

తెలుగు వాళ్ళు అయితే    ఖచ్చితంగా  మొదటదే అనుకుంటారు . కారణం భాష తెలుసు మీకు .. వాక్యల్లో పదాలు కాదు .. వాక్యం తెలుసు మీకు .. దానిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలుసు   మనలో చాల మందికి ఇంగ్లీషు పదాలు వచినా ప్రొగ్రమ్మింగు రాకపోవటానికి కారణం ఇదే .. పదాలు తెలుసు ... భష/ వాక్య నిర్మాణం తెలియదు 


మీలాగే కంప్యుటర్ కి కూడ పదాలకీ వాక్యాలకి అర్ధాలు ఎమిటో చెప్పి ఆ కొత్త భషలో కంప్యుటర్తో మాట్లాడటమే ప్రొగ్రమ్మింగు


ఉదాహరణకి మన కంప్యుటర్కి రెండు సంఖ్యలని  కూడటం మాత్రమే వచ్చు  అని అనుకుందాం అప్పుడు ..దానిటొ రెండు అంకెల్ని ఎల హెచ్చించచో ఎలా చెప్తాము ? 

1*3 =  కనుక్కొవటానికి  ఒకటిని మూడు సార్లు తనటొ కూడమని చెప్తాము.. 1 + 1 +1 .. 
ఇది ఒక ప్రొగ్రాం ...  దానికి తెలిసిన భాషలో మనకి కావల్సిన పని చేయించటం..

ఇక లక్షలు సంపాదించిపెట్టె కంప్యుటరు ఉద్యొగాల్లొ వెలగబెట్టే పనుల కోసం భాష ఇంకొచం ఎక్కువ పదాలు కలిగి వుంటుంది

ఎలాగంటే :

  1.   కండిషనల్స్   -> అయితే  (అది అయితే ఇది చెయ్యి .. కాకపోతే మరొకటి చెయ్యి) 
  2.   లూప్స్ -> ఒకే పని పలుమార్లు చెయ్యమని చెప్పటం 
  3.   ఫంక్షన్  -> ఒక విషయానికి సంబంధిన కొన్ని పనులకి ఒక పేరు పెట్టీ ఆ పనులని ఆ పేరుతో  గుర్తించటం..   ఉదహరణకి ..  పొద్దున ఆటొ ఎక్కి .. ఒక చోట దిగి .. ఆఫీసుకి వెళ్ళి పని చేసి .. ఇంటికి ఆటొ ఎక్కి రావటం .. అనే పనుల క్రమాన్ని .. ఆఫీస్కి  వెళ్ళొచ్చా అని అనటం       

No comments: